అనుష్కకు టీకప్పులు అందిస్తున్న సెలక్టర్లు (video)

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (16:11 IST)
భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ టీమిండియా సెలక్టర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీనటి అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలక్టర్ల పని అంటూ విమర్శించారు. ఇది మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ అని సెటైర్ వేశాడు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని ఫరూక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అసలు ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. సెలక్టర్లపై కోహ్లీ ప్రభావం మంచిది కాదని చెప్పారు. పది నుంచి 12 టెస్టు మ్యాచుల కంటే ఎక్కువ వీరెవరూ ఆడలేదని వెల్లడించారు. 
 
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఒక సెలెక్టర్‌ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ ఇంజినీర్ తెలిపారు. ఇండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో.. ఎవరని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 
ఇండియా బ్లేజర్ వేసుకున్నవారంతా సెలక్టర్లు అని చెప్పడంపై ఫరూక్ మండిపడ్డారు. సెలెక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ ఉండాలని తాను భావిస్తున్నానని ఫరూక్ ఇంజినీర్ చెప్పారు. వెంగ్ సర్కార్ లాంటి వ్యక్తులు కమిటీలో వుండాలని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments