టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్ ధోనీ ఫ్యాన్సును కలవరపెడుతోంది. ట్విట్టర్ ట్రెండింగ్‌లో #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటికే రకరకాలుగా వార్తలొచ్చిన నేపథ్యంలో.. వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు తర్వాత.. ధోనీ పూర్తిగా క్రికెట్‌కు దూరమవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ధోనీ వెస్టిండీస్ సిరీస్ సమయంలో దేశసేవ కోసమని సైన్యంలో చేరాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉండలేదు. తాజాగా బంగ్లా సిరీస్‌కూ దూరంగానే ఉన్నాడు. ఇదే సమయంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం, మహీ భవితవ్యం గురించి చర్చిస్తానన్న నేపథ్యంలో ధోనీ రిటైర్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ఉన్నట్టుండి.. ట్రెండింగ్‌లో వచ్చింది.
మంగళవారం ఉదయం నుంచి ఇది టాప్-10లో ఉంది. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ హ్యాష్‌ట్యాగ్ నకిలీదని తెలయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఇలాంటి నకిలీ హ్యాష్‌ట్యాగ్‌లను ఆపేయాలని మహీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇంకా ధోనీకి మద్దతుగా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్ కాడని, మీడియా ధోనీకి రిటైర్మెంట్ ఇప్పించాలనుకుంటుందా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.