గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదం జరిగివుండివుంటే కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం గురించి ఈ దేశానికి తెలిసివుండేది కాదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెలలో వశిష్ట పర్యాటకుల బోటు గోదవరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ బోటును 38 రోజుల తర్వాత విజయవంతంగా వెలికితీశారు.
అయితే, దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు.
అయితే, ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ధర్మాడి సత్యానికి పేరొచ్చేది కాదన్నారు. చంద్రబాబే బోటును వెలికితీసినట్టు ప్రచారం జరిగేదని, ధర్మాడి సత్యం పేరు ఎవరికీ తెలిసేది కాదన్నారు. చంద్రబాబే దగ్గరుండి డైవర్లకు మార్గదర్శనం చేసి గొలుసులు వేసి పడవను బయటికి లాగాడని కులమీడియా బాకాలు ఊదేదని విమర్శించారు.