అది గోదావరి కావొచ్చు లేదా కృష్ణా నది కావొచ్చు... మరోనదైనా కావొచ్చు... ఏ నదిలోనైనా బోటు ప్రమాదం జరిగినా అది ఆదివారం పూటే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది. తాజాగా గోదావరి నదిలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం కూడా ఆదివారమే సంభవించింది. మొత్తం 61 మందితో వెళుతున్న ప్రమాదం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది చనిపోగా, 25 మంది గల్లంతయ్యారు. మరో 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
అయితే, ఈ బోటు ప్రమాదాలన్నీ ఆదివారమే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే, విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద 12 నవంబరు 2017న కృష్ణానదిలో భక్తులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగింది ఆదివారమే.
గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలో బోటు తిరగబడి 15 మంది చనిపోయారు. ఇది కూడా ఆదివారమే జరిగింది. తాజా ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. శని, ఆదివారాలు వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆనందంగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఏపీ, తెలంగాణలోని పలు కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.