గోదావరి బోటు ప్రమాదం-12 మంది ప్రాణాలు జలార్పణం.. 22 మంది సురక్షితం

ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:46 IST)
గోదావరి బోటు ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 22మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి అధికారులు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవు. 
 
బోటు యజమాని పేరు వెంకటరమణగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 62మంది వున్నారని చెప్పారు. వీరిలో 51 మంది ప్రయాణికులు 11 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రమాదం జరిగిన రాయల్ వశిష్ట బోటులో 22మంది హైదరాబాద్ వాసులు, 9 మంది విశాఖ వాసులు, ఇద్దరు రాజమండ్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం "చంద్రబాబుకో దండం" పవన్ కాపుల గురించి మాట్లాడట్లేదు.. తోట తూర్పు