ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్త జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.