Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

370 అధికరణపై సుప్రీంకోర్టులో విచారణ.. ఆజాద్‌కు ఊరట కలిగేనా?

370 అధికరణపై సుప్రీంకోర్టులో విచారణ.. ఆజాద్‌కు ఊరట కలిగేనా?
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (11:08 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం చర్చ జరుగనుంది. 
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గంగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్‌ సహా ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లను విచారణకు చేపట్టనుంది. 
 
తమ సహచర నేత, చట్టసభ సభ్యుడు మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి నిర్బంధాన్ని సవాల్‌ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే, తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్‌ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. 
 
తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కాశ్మీర్‌ ప్రజల బాగోగులను తాను తెలుసుకోగోరుతున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. తాను మానవతా దృక్పథంతోనే పిటిషన్‌ దాఖలు చేశానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్‌ వివరించారు. ఈ పిటిషన్ల‌న్నింటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోటు ప్రమాదం : సుడిగుండం - ఉక్కపోతే కొంపముంచాయా?