Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపికొండ టూర్‌లో విషాదం... మృతులు ఎంతమందో తెలుసా?.. కారణమిదే...

పాపికొండ టూర్‌లో విషాదం... మృతులు ఎంతమందో తెలుసా?.. కారణమిదే...
, ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (18:40 IST)
గోదావరి నదిలో ఆదివారం జరిగిన పడవ ప్రమాదం యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. 61 మందితో పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న బోటు మధ్యలోనే మునిగిపోవడంతో 12 మంది వరకు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పటివరకు 16 మంది సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు. 
 
కాగా, మరణించినవారిలో బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన చోట పెద్ద సుడిగుండం ఉంటుందని, అక్కడ బోటును అదుపుచేయడంలో డ్రైవర్లు విఫలం కావడంతోపాటు, బోటుపైకి ప్రయాణికులు ఒకే సారి పెద్ద సంఖ్యలో చేరడం కూడా ప్రమాదానికి దారితీసిందని అంచనా వేస్తున్నారు.
 
గత రెండు నెలలుగా గోదా వరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం నదీ తీర గ్రామాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రమాదకర సమయంలో పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్‌ బోట్‌ల యాజమాన్యాలు దేవీపట్నం గోదావరిపై వరదల సమయంలో విహారయాత్రలకు బోట్‌లను తిప్పుతున్నారు. 
 
ఈబోట్‌లు పోశ మ్మగండి నుంచి పేరంటాలపల్లి వరకు పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెడుతున్నాయి. శనివారం ఒక బోట్‌లో 50మంది పర్యాటకులు నదీ విహారానికి వెళ్లారు. అధికారులు చోద్యం చూస్తూ ఆ బోట్‌ను నిలుపుదల చేసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. 
 
ఇప్పటికీ గోదావరి వరదల నేపథ్యంలో దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో పాపి కొండల విహారానికి బోట్‌లను నడపడం పర్యాటకుల ప్రాణాలను ఫణంగా పెట్టడమే. గతంలో మంటూరు - వాడపల్లి మధ్య ఒక లాంచి మునిగి 19 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 
 
అప్పటి నుంచి బోట్‌ల రాకపోకలకు సంబంధించిన అనుమతులను పశ్చిమగోదావరి జిల్లా అధికారులే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నదీ విహారం నిషేధమైనప్పటికి ఒక బోట్‌ 61 మందితో పాపికొండల విహారయాత్రకు వెళ్లి ప్రమాదానికి గురైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు...