Webdunia - Bharat's app for daily news and videos

Install App

జికా వైరస్ దెబ్బకు వణికిపోతున్న ఉత్తరప్రదేశ్ - 106 పెరిగిన కేసులు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:47 IST)
కరోనా వైరస్ కాస్త శాంతించినట్టు కనపిస్తుంది. కానీ, జికా వైరస్ మాత్రం చాపకింద నీరులా మెల్లగా విస్తరిస్తుంది. తొలుత కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ జికా వైరస్.. ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే యూపీలో మొత్తం జికా కేసుల సంఖ్య 106కు పెరిగాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు గర్భిణులు ఉండటం గమనార్హం. 
 
అయితే, రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య పెరగతుండటంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీపాల్ సింగ్ మాట్లాడుతూ... కొత్తగా వైరస్ బారిన పడిన 16 మంది కాన్పూర్ లోని హర్జీందర్ నగర్, పోఖార్ పూర్, తివారీపూర్ బగియా, క్వాజీ ఖేరా ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. 
 
వైరస్ బారిన పడిన గర్భిణులకు వైద్యులు అల్ట్రాసౌండ్ టెస్టులు నిర్వహించారని... ఇద్దరి గర్భాల్లోని పిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. జికా వ్యాప్తి నేపథ్యంలో కాన్పూర్ లో 100 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. హోం శాంపిల్స్‌ను సేకరించేందుకు వీలుగా 15 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
 
జికా వ్యాప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు 15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను రంగంలోకి దించారు. జికా బారిన పడిన వారిలో అత్యధికులు అసింప్టొమేటిక్ అని వైద్యాధికారులు తెలిపారు. వైరస్ నేపథ్యంలో డోర్ టు డోర్ సర్వే, శాంప్లింగ్ చేస్తున్నామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments