ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు జికా వైరస్ ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం యూపీలో కొత్తగా మరో 13 జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 79 జికా కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యంగా కాన్పూర్ జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు వైద్య అధికార బృందం గుర్తించింది. దీంతో వ్యాప్తి కట్టడికి వేగంగా చర్యలు చేపట్టెందుకు కృషి చేస్తోంది. వ్యాధి సోకిన వారితో దగ్గరగా ఎవరు ఉన్నారు అని గుర్తించే పనిలో పడింది. ఏదైమైన జికా వైరస్ పెరుగుదల అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. జిల్లాలో మొత్తం 150 బృందాలు శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.