కాన్పూర్‌ను వణికిస్తున్న జికా వైరస్ - 96 యాక్టివ్ కేసులు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (09:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌ను జికా వైరస్ వణికిస్తుంది. ఈ నగరంలో మొత్తం 96 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 123గా వుంది. 
 
కాన్పూర్‌లో మొత్తం 123 కేసులు ఉన్నాయనీ, ఇందులో 96 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో మూడు కేసులు లక్నోలో, ఒక కేసు కన్నౌజ్‌లో నమోదైందని తెలిపారు. 
 
అయితే, ఈ వైరస్ ఎలా, ఎవరి వల్ల వ్యాప్తి చెందిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు. కాన్పూర్‌లో మొదటి జికా వైరస్‌ కేసు అక్టోబర్‌ 23న నమోదైంది. నగరంలో తొలిసారిగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన వారెంట్‌ ఆఫీసర్‌లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. 
 
మరోవైపు, ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 నెలల కనిష్టానికి తగ్గిపోయాయి. ఆదివారం 11,271 కేసులు నమోదుకాగా, 285 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా దిగివచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 11 వేలకుపైగా కేసుల్లో దాదాపు సగం అంటే 6 వేలకుపైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజులోనే 12,55,904 మందికి పరీక్షలు నిర్వహించారు. 
 
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,63,530కి పెరిగింది. కరోనా మహమ్మారి నుంచి గత 24 గంటల్లో 11,376 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటింది.
 
రికవరీ రేటు అత్యధికంగా 98.26 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి తర్వాత రికవరీ రేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17 నెలల కనిష్ఠానికి తగ్గింది. ప్రస్తుతం 0.39 శాతం మంది అంటే 1,35,918 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 112 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments