Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ మృతికి సైటోకైన్ స్టార్మ్ కారణమా? (video)

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:59 IST)
కరోనా వైరస్‌ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
శుక్రవారం ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు.
 
ఇకపోతే.. కరోనా వైరస్ మృతికి సైటోకైన్ స్టార్మ్ కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సైటోకైన్లు అంటే ప్రోటీన్లు. ఇవి రోగనిరోధక శక్తిలో భాగమే. కానీ రోగనిరోధక శక్తి తిరగబడితే.. అప్పుడు సైటోకైన్ ప్రభంజనం ఏర్పడుతుంది. దాని వల్ల భారీ ఎత్తున మానవ దేహంలోకి సైటోకైన్లు రిలీజ్ అవుతాయి. ఆ రిలీజైన సైటోకైన్ల వల్లే మనుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు స్పెయిన్ డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
అధిక మోతాదులో రిలీజైన సైటోకైన్లు.. వివిధ శరీరా అవయవాలను నాశనం చేస్తున్నాయి. అందుకే కరోనా వైరస్ సోకిన వ్యక్తులు భిన్న లక్షణాలతో మరణిస్తున్నారని బార్సిలోనా బెలివిట్జ్ హాస్పటల్ డాక్టర్ రఫేల్ మనేజ్ తెలిపారు.
 
సంక్లిష్టమైన కేసుల్లో వైరల్ లోడ్ వల్ల కాకుండా.. సైటోకైన్ ప్రభంజనం వల్ల చనిపోతున్నట్లు నిర్ధారణకు వస్తున్నారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్లలో పది శాతం మంది సైటోకైన్ స్టార్మ్‌తో ఇబ్బందిపడుతున్నారని శాస్త్రవేత్తలు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: కూలిపోతున్న వంతెన మీద స్టిక్ తో మిరాయ్ లో తేజ లుక్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments