Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి మందులువాడేవారు వ్యాక్సిన్‌ తీసుకోకూడదు?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:14 IST)
కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయి. ఏ చేతికి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి? ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు, గర్భవతులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా? డోసుల మధ్య ఎంత గ్యాప్‌ ఉండాలి? ఇలాంటి అనేక సందేహాలను నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఫార్మకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి నివృత్తి చేశారు. కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సందేహాలకు డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు...
 
ఇమ్యునోసప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌, హెచ్‌ఐవీకి మందులు వాడుతున్నవారు వ్యాక్సిన్‌ వేయించుకోకూడదు. స్టెరాయిడ్స్‌లో చాలా రకాలు  ఉన్నాయి. వీటిలో నోటి ద్వారా, ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారు టీకాకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వేయించుకున్నా ఉపయోగం ఉండదు. వారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి కావు. అలర్జీ ఉన్నవాళ్లు స్టెరాయిడ్స్‌ వాడుతుంటే టీకా తీసుకోకూడదు.
 
ఇమ్యునోసప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌ మందులు కొద్దిరోజులు ఆపేసి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా?
తమకు మందులు సూచించిన వైద్యున్ని సంప్రందించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇమ్యునోసప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌ ఆపేస్తే చికిత్సలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
 
టీకా తీసుకునేముందు కరోనా టెస్ట్‌ చేయించుకోవాలా?
అవసరం లేదు. వైరస్‌ లక్షణాలు లేన్నప్పుడు, ఇంటిలో ఎవరూ పాజిటివ్‌ కానప్పుడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్భయంగా టీకా వేసుకోవచ్చు.
 
వ్యాక్సినేషన్‌ తర్వాత పరీక్ష చేయిస్తే పాజిటివ్‌ వస్తుందా? వారిలో వైరస్‌ లక్షణాలు ఉంటాయా?
అది తప్పు. కేవలం అపోహ మాత్రమే. అలా అయితే అందరికీ వైరస్‌ సోకే ముప్పు ఉంటుంది కదా? టీకా వేసుకోవడానికి ముందుగానీ, తర్వాతగానీ శరీరంలోకి వైరస్‌ ప్రవేశిస్తే పాజిటివ్‌గా తేలుతుంది. వ్యాక్సినేషన్‌ వల్ల పాజిటివ్‌ రాదు. ఇతరుల ద్వారా వైరస్‌ సోకితేనే వస్తుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments