Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డు సృష్టించిన మీరఠ్ జైలు ఖైదీలు.. మూడు రోజుల్లో 7వేల మాస్కులు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:04 IST)
ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. మాస్కులు  తప్పనిసరి అయ్యాయి. ఈ మహమ్మారిపై పోరులో మాస్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో మీరఠ్ జైలులో ఆపరేషన్ మాస్క్ తయారీ కొనసాగుతోంది. ఈ క్రమంలో కారాగారంలో ఉండి కూడా కరోనాపై పోరు సాగిస్తున్నారు ఖైదీలు. మాస్కుల తయారీలో రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు మీరఠ్ జిల్లా కారాగారంలో ఉంటున్న ఖైదీలు.
 
మాస్కులు తయారు చేయటంతో సరికొత్త రికార్డు సృష్టించారు మీరఠ్ జైలు ఖైదీలు. కేవలం మూడంటే మూడు రోజుల్లో ఏకంగా 7వేల మాస్కులు తయారు చేసి..కొత్త రికార్డు సృష్టించారు. మాస్కుల తయారీ పనిలో మొత్తం 40 మంది ఖైదీలు పాలుపంచుకున్నారు.
 
ఈ సందర్భంగా జైలు అధికారి పాండే మాట్లాడుతూ.. జైలులో మాస్క్‌లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్నామనీ..15 నుంచి 15 వేల మాస్కులు తయారు చేసి రిజర్వులో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్యూర్ కాటన్‌తో తయారు చేసిన ఈ మాస్కులో మూడు లేయర్లు ఉంటాయని వివరించారు.
 
అలాగే ఈ మాస్కులను శానిటైజ్ చేసి.. ప్యాక్ చేస్తున్నామని తెలిపారు. ఒక్కో ఖైదీ రోజుకు 125 మాస్కులు వరకూ తయారు చేస్తున్నారనీ.. ఒక్కో మాస్క్ తయారీకి ఒక రూపాయికి ఇస్తామని తెలిపారు. 
 
మాస్కుల తయారీలో కొంతమంది ఖైదీలు కాటన్ వస్త్రాన్ని కట్ చేసి ఇస్తే మరికొంతమంది ఖైదీలు మిషన్లపై మాస్క్‌లను కుడతారని తెలిపారు. ఒక మాస్క్ తయారీకి ఎనిమిది రూపాయల వరకూ ఖర్చవుతుందని..కానీ తాము ఒక్కో మాస్కు రూపాయికే ఇస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments