Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాక్సిన్‌తో కోతుల్లో కోవిడ్ తగ్గిందట...

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (20:04 IST)
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కోతులపై కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేసిన పరిశోధన ఆశలు చిగురింపజేస్తోంది. కోవిడ్‌ని నియంత్రించేందుకు వారు తయారు చేసిన వ్యాక్సిన్ కోతులపై విజయవంతమైందని ప్రకటించారు. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కోతుల్లో రోగనిరోధక శక్తి కోవిడ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు. 
 
ప్రతికూల ప్రభావాలేవీ వాటిలో కనిపించలేదని తెలిపారు. మనుషులపై ప్రయోగ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కోతుల్లో న్యుమోనియా తగ్గిపోయిందని వెల్లడించారు. అత్యంత ప్రమాదకర నావెల్ కరోనా వైరస్‌ని సైతం ఇది ఎదుర్కొందని చెప్పారు. ఒక డోసుతోనే మంచి ఫలితం కనిపించిందని వెల్లడించారు. 
 
ఇది మనుషులపై కూడా సానుకూల ఫలితాలు కనబరుస్తుందని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌లు విశ్వాసం వ్యక్తం చేసారు. వ్యాక్సిన్ విజయవంతమైతే ఏడాది చివరికల్లా 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసేందుకు బ్రిటిష్ డ్రగ్ కంపెనీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments