తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (12:55 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే  కరోనా బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా సోకింది.
 
ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా బారిన పడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సురేందర్ ప్రస్తుతం హైదరాబాదులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కారణంగా ప్రజా ప్రతినిధులు కోవిడ్ 19 మహమ్మారి బారిన పడుతున్నారు.
 
ఎమ్మెల్యే సురేందర్ సైతం ఇటీవల కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. పలు సమావేశాలకు, కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రజాప్రతినిధులు తీవ్రంగా కరోనా బారిన చిక్కుకోవడం వలన కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకుల మధ్య తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments