దేశంలో కొత్తగా మరో 15 వేల కేసులు - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:13 IST)
దేశంలో కొత్తగా మరో 15 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 15,528 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా నమోదైంది. ముందురోజు 50కి పైగా సంభవించిన మరణాలు.. 24 గంటల వ్యవధిలో 25కి తగ్గాయి. గత రెండేళ్ల కాలంలో 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.25 లక్షల మంది మరణించారని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,43,654 (0.33శాతం)కు చేరాయి. సోమవారం 16 వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ఇక ఇప్పటివవరకూ 200.3 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 27.78 లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments