Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యధిక క్రిమినల్ కేసులు.. టాప్ ప్లేసులో తెలంగాణ సీఎం కేసీఆర్

kcrcm
, శనివారం, 16 జులై 2022 (13:34 IST)
అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన దేశంలోని ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టాప్‌లో నిలిచారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరపాలని అడుగలు వేస్తోన్న కేసీఆర్‌ను అత్యధిక క్రిమినల్ కేసులున్న లీడర్ ఫోకస్ కావడం గమనార్హం.
 
ఢిల్లీకి చెందిన ఎన్నికల నిఘా సంస్థలు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్, చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల అఫిడవిట్‌లను విశ్లేషించాయి. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 64 కేసులు ఉన్నాయని, వాటిలో 37 కేసులు తీవ్రమైన IPC లెక్కింపు ఉన్నాయని నిర్ధారించాయి.
 
కాగా, కేరళ ఎంపీ డీన్‌ కురియకోస్‌పై 204 కేసులతో స్వర్ణం కైవసం చేసుకున్నారు. 99 పెండింగ్‌ కేసులతో డీఎంకే ఎంపీ ఎస్‌. కతిరవన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌కు 87 ఉన్నాయి. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో ఐదో స్థానంలో నిలిచారు.
 
జూలై 18, 2022న జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికలకు ముందు, ఈ రెండు వాచ్ బాడీలు మొత్తం సిట్టింగ్ ఎంపీలు , ఎమ్మెల్యేలకు చెందిన 4,759 అఫిడవిట్‌లతో కలిపి మొత్తం 4,809 అఫిడవిట్‌లను అధ్యయనం చేశాయి. వీళ్లందరూ 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఓటర్లుగా గుర్తించడమే కాకుండా ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు.
 
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపదో ముర్ము ఆస్తులను నిశితంగా పరిశీలిస్తే, గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆమె 2 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ముర్ము ఎన్నికైతే రాష్ట్రపతి అయిన భారతదేశపు తొలి గిరిజన మహిళ అవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మంకీపాక్స్.. అలెర్ట్ అయిన తెలంగాణ