Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉన్న ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:23 IST)
కోవిడ్‌-19 నేప‌థ్యంలో లాక్డౌన్ అనంత‌రం 5 రోజుల ముందు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మొత్తం 435 మంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. వీరంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల్లో కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించారు. 
 
అయితే, మార్చి 9న విద్యార్థులంద‌రికీ మ‌రొక‌మారు క‌రోనా ర్యాపిడ్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా 57 మంది విద్యార్థుల‌కు పాటిజివ్ రిపోర్టు వ‌చ్చింది. అధికారులు వెంట‌నే స్పందించి మెరుగైన వైద్య చికిత్స‌ల కోసం తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డ‌మైన‌ది. 
 
మ‌ళ్లీ వారికి ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష చేయించ‌డం జ‌రిగింది. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం వారికి ఎలాంటి వ్యాధి లక్ష‌ణాలు లేవు. వారు ప‌రిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వ‌ర‌లోనే వారిని డిశ్చార్జి చేస్తారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టిటిడి అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది.
 
ఈ నేప‌థ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థుల‌కు, 35 మంది అధ్యాప‌కుల‌కు, 10 మంది ఇత‌ర సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అంద‌రికీ నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments