తెలంగాణాలో కరోనా ఉధృతి - రికార్డు స్థాయిలో 169 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత వారం రోజులుగా ఈ వైరస్ ఉధృతితీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా శుక్రవారం రికార్డు స్థాయిలో ఏకంగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
లాక్డౌన్‌ కఠినంగా అమలులో ఉన్నా ఇలా కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇందులో తెలంగాణకు చెందిన కేసులు 100 కాగా.. ఇతర రాష్ట్రాలు, సౌదీ నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 973, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,381గా ఉంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,008కి చేరుకుంది. 
 
ఇకపోతే, ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లాల వారీగా పరిశీలిస్తే, కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌కు చెందిన కేసులే 82 ఉండటం నగరవాసులను కలవరపాటుకు గురిచేసే విషయం. రంగారెడ్డి జిల్లా-14, మెదుక్-02, సంగారెడ్డి-02 కేసులు నమోదయ్యాయి. వలస కూలీల్లో 05 కరోనా సోకింది. 
 
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 64 మంది మొత్తం 69 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 71 మంది కరోనా పోరాడి చనిపోయారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వణపర్తిలో మాత్రం కేసులేమీ నమోదు కాలేదు. మరోవైపు కొన్ని జిల్లాలో గత 14రోజులుగా కొత్తకేసులేమీ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivani Nagaram: కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను : శివానీ నగరం

2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

Mani Ratnam: తు యా మైన్ చిత్రంపై మణిరత్నం ప్రశంసల జల్లు

Shivani Nagaram: కాత్యాయని పాట ఎందుకు హిట్ అయిందో తెలిదు :శివాని నాగరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments