తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది.
కొత్తగా 6,542 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,62,160 మంది కోలుకున్నారు. మరో 51 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.52శాతంగా ఉందని, రికవరీ రేటు 81.68 శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 77,930 టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,507 ఉన్నాయి.