Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఏం జరుగుతోంది? కరోనావైరస్ కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (22:12 IST)
తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ 19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా కొత్త కోవిడ్ -19 కేసులలో తమిళనాడు శనివారం మరో రికార్డును నమోదు చేసింది. గత 24 గంటల్లో 1,989 కొత్త కేసులతో మొత్తం 42,687కు చేరుకుంది. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1,982 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
 
గుర్తించిన 1,989 కేసుల్లో పది కేసులు ఖతార్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 30 మరణాలు చోటుచేసుకున్నాయి. దీనితో తమిళనాడులో ఈ వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 397కు పెరిగింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 18,878 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 23,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనావైరస్ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 6,91,817 నమూనాలను పరీక్షించారు. వీటిలో శనివారం పరీక్ష చేసిన 17,911 నమూనాలు కూడా వున్నాయి.
 
రాష్ట్రంలో 79 కోవిడ్ -19 పరీక్షా సదుపాయాలు ఉన్నాయి, వాటిలో 45 ప్రభుత్వ, 34 ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నై 1,487 కేసులతో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ పట్టికలో ముందంజలో ఉంది. చెన్నైలో మాత్రమే నమోదైన కరోనా కేసులు మొత్తం 30,444గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments