Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన వృద్ధ దంపతులకు వేధింపులే మిగిలాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (23:06 IST)
ఓ వైపు మనం పోరాడాల్సింది కరోనాతో.. కానీ, రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగులపై వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు హమీదా బీ కూడా కరోనాతో పోరాటం చేసి విజయం సాధించింది.. కానీ, ఆమె ఉండే ప్రాంతంలోని స్థానికుల వేధింపులు, బెదిరింపులు పెరిగిపోవడం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. అయితే.. అంబూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా మళ్లీ ఇంటికి చేరుకున్నారు. కానీ, చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు ఆమెను వింతగా చూడడం.. సూటిపోటి మాటలు కూడా అనడంతో ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
 
దాదాపు 15 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వృద్ధురాలికి కరోనా వచ్చిన తర్వాత ఇంటి యజమాని కూడా వేధింపులకు గురిచేశాడని.. వెంటనే ఖాళీ చేయాలంటూ వేధించసాగాడు.. ఒక ఇరుగుపొరుగువారి నుంచి కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆ వృద్ధురాలు వాపోయింది. 
 
కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో.. ఆమె ఇంటికి వచ్చిన స్థానిక అధికారి గాయత్రి సుబ్రమణి... హమీదా బీను ఓదార్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఫించన్ కూడా ఇస్తామని వెల్లడించి ధైర్యాన్ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments