Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌కు హాట్‌స్పాట్‌గా భారత్.. కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (10:53 IST)
కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌కు గ్లోబల్‌ హాట్‌స్పాట్స్‌గా  కొన్నిదేశాలు మారాయి. స్ట్రెయిన్‌ ఇలా ప్రాణాంతకంగా మారటానికి అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. ప్రజల్లో మారుతున్న ధోరణులు కూడా ఇందుకు మరో ముఖ్య కారణం. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. అయితే, భారత్‌లో కేరళ, ఈశాన్య ప్రాంతాలు స్ట్రెయిన్‌ ఎక్కువగా ప్రభావితం చెందేవి. 
 
పశుమాంసం ఉత్పత్తి, అడవులు అంతరించిపోతున్న ప్రాంతాల్లో వైరస్‌ ప్రాణాంతకంగా మారుతుందని మాజీ ప్రొఫెస్‌ర్, ప్రముఖ వైరాలజిస్ట్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ డాక్టర్‌ జాకబ్‌ జాన్‌ తెలిపారు. ఈయన వెల్లూరుకు చెందినవాడు. ఇతను కూడా ఈ పరిశోధకుల్లో ఒకరు. ఎలుకలకు, గబ్బిలాలు ఎబోలా. కోవీ2, మెర్స్‌ రోగాల వ్యాప్తి చెందిస్తున్నాయి. దీనికి నిఫా వైరస్‌ ప్రథమ ఉదాహరణ. 
 
భారత్‌లో అయితే.. ఒక ప్రాంతాంలో ఏదైనా వ్యాధి పుడితే అది కచ్చితంగా వ్యాపిస్తుంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఈశాన్య భారత్‌ ప్రాంతాలు గబ్బిలాలకు ఆవాసయోగ్యమైనవని జాన్‌ డాక్టర్‌ జాన్‌ చెప్పారు. అడవుల ఆక్రమణ, పశు సేద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రావు తెలిపారు.
 
ఈ స్టడీస్‌ ప్రకారం ఆ ప్రాంతాల్లో ల్యాండ్, పశువిప్లవం వంటి మార్పులే ఈ వైరస్‌ ప్రాణాంతకంగా మారటానికి ప్రధాన కారణం. పక్షులు ఇతర గబ్బిలాలకు సులభంగా వ్యాప్తి చెందుతాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ, ది పాలిటెక్నికో డి మిలానో(పాలిటెక్నిట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మిలానో), న్యూజిలాండ్‌కు చెందిన మస్సే యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని 'నేచర్‌ ఫుడ్‌'లో ప్రచురించారు. సేద్యం, పశువిప్లవంలో మార్పులు జనాభా పెరుగుదల కూడా స్ట్రెయిన్‌ వ్యాప్తికి కారణం.
 
గుర్రపు డెక్క గబ్బిలాలకు మనుషులకు పెరుగుతున్న కాంటాక్ట్‌ కూడా ఒక కారణమే. ముఖ్యంగా చైనాలో మాంసానికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది, పెద్ద ఇండస్ట్రీలు కూడా మీట్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఉత్పత్తిపైనే అధికంగా కేంద్రీకృతమైనందుకు అత్యధిక జనాభా ఒకే విధమైన జెనెటిక్స్‌ ఏర్పడి వ్యాధి వ్యాప్తికి దోహదపడతాయి.
 
చైనా కాకుండా ఇతర ప్రాంతాలపై వైరస్‌ వ్యాప్తి ప్రభావం పడే ప్రాంతాలు జావా, భూటాన్, ఈస్ట్‌ నేపాల్, ఉత్తర బంగ్లాదేశ్‌ ప్రాంతాలు, భారత్‌లోని కేరళ, ఈశాన్య ప్రాంతాలు. అతి తక్కువ ప్రభావితం చెందే ప్రాంతాలు కూడా చైనాలో ఉన్నాయి. దక్షిణ షాంఘై, జపాన్, ఉత్తర ఫిలిప్పైన్స్‌ రాబోవు రోజుల్లో ప్రభావితం చెందే ప్రాంతాలని పరిశోధకులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments