Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో 7,45,000 మంది మృతి, డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ న్యూస్

వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో 7,45,000 మంది మృతి, డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ న్యూస్
, సోమవారం, 17 మే 2021 (12:45 IST)
కరోనా మహమ్మారితో లాక్ డౌన్ విధించిన కారణంగా పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి అధికమవుతోంది. తద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది. అతి సుదీర్ఘ సమయం పాటు ఉద్యోగం చేస్తున్నవారు వేల సంఖ్యలో మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
 
2106లో నిర్వహించిన అధ్యయన నివేదికను ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసింది. ప్రతి ఏడాది 745000 మంది మరణిస్తున్నట్లు ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. అతి సుదీర్ఘ సమయం పనిచేయడం వల్ల.. 2016లో ఏడు లక్షల 45 వేల మంది మరణించారని, వారిలో గుండె, హృద్రోగ సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినవారు అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. 
 
అయితే లాంగ్ వర్కింగ్ హవర్స్ మృతుల్లో.. దక్షిణాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా ఉదృతి నెలకొన్న నేపథ్యంలో ఆ మరణాల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది.
 
వారానికి 55 గంటలు లేదా అంత కన్నా ఎక్కువ సమయం పనిచేస్తే.. దాని వల్ల 35 శాతం మంది ఉద్యోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన రిపోర్ట్‌లో చెప్పింది. ఇక గుండె సంబంధిత ఇతర రుగ్మతలతోనూ 17 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
 
వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసేవారితో పోలుస్తూ.. డబ్లూహెచ్‌వో ఈ నివేదికను తయారు చేసింది. ఈ అధ్యయనం కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) కూడా పనిచేసింది. పని సమయం ఎక్కువై మరణించిన వారిలో మూడవ వంతు.. మధ్య వయస్కులు లేదా అంత కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన అధ్యయనంలో తేల్చింది.
 
అయితే కరోనా కాలంలో మాత్రం ఈ స్టడీ చేయలేదు. కానీ ఇటీవల తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో వర్కింగ్ హవర్స్‌ను పెంచేశారు. లాక్‌డౌన్ వల్ల కంపెనీలు వర్కింగ్ హవర్స్ దాదాపు 10 శాతం పెంచినట్లు డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ ఆఫీసర్ ఫ్రాంక్ పెగా తెలిపారు. దీని వల్ల ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని, దాంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
 
ఉద్యోగ సంబంధిత మరణాల్లో.. మూడవ వంతు మరణాలు.. ఎక్కువ సమయం పనిచేయడం వల్ల జరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని కూడా డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో ఓ సూచన చేసింది. 
 
ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఉద్యోగులపై అదనపు సమయం భారాన్ని వేస్తున్నారు. కానీ దాని వల్ల మరణాలు పెరుగుతున్నట్లు పెగా తెలిపారు. ఆర్థిక సంక్షోభ సమయంలో వర్కింగ్ హవర్స్‌ను పెంచకపోవడమే మంచిదని, అది ఓ చురుకైన నిర్ణయం అవుతుందని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Airtel Free pack, 5.5 కోట్ల మందికి రూ.49 రీఛార్జ్‌ ఉచితం