Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తౌతే తుఫాను బీభత్సం... ముంబై ఎయిర్‌పోర్ట్ మూసివేత... గుజరాత్‌లో ప్రళయం

Advertiesment
తౌతే తుఫాను బీభత్సం... ముంబై ఎయిర్‌పోర్ట్ మూసివేత... గుజరాత్‌లో ప్రళయం
, సోమవారం, 17 మే 2021 (12:04 IST)
అరేబియా సముద్రంలో పుట్టిన తౌతే తుఫాను ఇప్పటికే కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో విరుచుకుపడింది. మరోవైపు ఈ తుపాను ప్రస్తుతం ముంబైకి వాయవ్య దిశగా 16 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను నేపథ్యంలో ముంబై ఎయిర్ పోర్టు మూతపడింది.
 
ఈ తుఫాను సోమవారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోర్ బందర్, మహువా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 
వివిధ ప్రాంతాల్లోని లోతట్టు వాసుల్లో దాదాపు లక్షన్నర మంది ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయని, 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
 
మరోవైపు అధికారుల హెచ్చరికలతో 2,200 ఫిషింగ్ బోట్లు గుజరాత్ కు, 4,500 పడవలు మహారాష్ట్రకు సురక్షితంగా చేరుకున్నాయి. సముద్రంలో ఉన్న 300 వాణిజ్య నౌకలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఆయిల్ రిగ్ ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ కొత్త లక్షణం... కోవిడ్ టంగ్.. నాలుక రంగు మారుతుందట.. దురద కూడా..?