Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:18 IST)
గుంటూరులో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం మరిన్ని కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 327 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుంటూరు సిటీలో మాత్రం 185 కేసులు నమోదైనాయి. దీంతో జిల్లా కలెక్టర్. శామ్యూల్ ఆనంద కుమార్ నగరంలోని అనేక నివాస ప్రాంతాలతో కూడిన బ్రాడీపేట్, లక్ష్మీపురం, శ్రీనగర్ కాలనీ మరియు అమరావతి రోడ్డులోని అనేక ప్రాంతాలను కలిగి ఉన్న 14 కంటైన్మంట్ జోన్లను ప్రకటించారు.
 
బ్రాడీపేటలో 40 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోజులలో శుక్రవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని టోకు, రిటైల్ సంఘాలు ప్రకటించాయి. జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలతో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్, కరోనా రోగులను గుర్తించడానికి నిఘా బృందాలను సేవల్లోకి తీసుకువస్తామని చెప్పారు. 
 
అన్ని మండలాల్లో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇందులో భాగంగా 20 కేసులతో మంగళగిరి మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం.. చికిత్స అందించడం వంటివి జరుగుతున్నాయని.. కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఇంకా దుకాణాదారుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments