Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని మాల్‌లో గుంపులు గుంపులుగా జనం, నో మాస్క్, నో డిస్టెన్స్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:31 IST)
తిరుపతిలో కరోనాను పూర్తిగా మర్చిపోయారు నగర వాసులు. ఎక్కడా మాస్కులు, భౌతిక దూరం కనిపించలేదు. దీంతో తిరుపతి నగరంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని స్వయంగా నగర పాలక కమిషనర్ గిరీషా తెలిపారు. 1.5 శాతం ఉన్న కరోనా కేసులు 4 శాతంకు చేరిందన్నారు.
 
గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోందని.. నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దన్నారు. ఉన్నట్లుండి నగర పాలకసంస్ధ కమిషనర్ తిరుపతి నగరంలోని పలు వస్త్ర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
 
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జనం గుంపులు గుంపులుగా ఉండడాన్ని గమనించారు గిరీషా. అస్సలు ఏమాత్రం మాస్కులు ధరించకుండా.. సామాజిక దూరాన్ని గాలికొదిలేసి దగ్గర దగ్గరగా గుంపులు గుంపులుగా ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నిర్వాహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 50 వేల రూపాయల జరిమానా విధించారు గిరీషా. కలెక్టర్ దృష్టికి వెళితే షాపును పూర్తిగా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. తాత్కాలికంగా షాపింగ్ మాల్‌ను మూసివేశారు. అలాగే మరికొన్ని షాపింగ్ మాల్స్‌ను పరిశీలించిన కమిషనర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments