కరోనా వైరస్ బారినపడిన ఒంగోలు ఎంపీ!

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ నేత కరోనా వైరస్ బారినపడ్డారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో దవాఖానలో చేరారు. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,78,285 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,355 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 8,66,856 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 7074 మంది మరణించారు. రాష్ట్రంలో నిన్న 479 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments