Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 28న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 24 గంట‌ల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే నిన్న‌ 689 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు.
 
మరో 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 
 
కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో 689 మంది క‌రోనాతో మృతి చెందారు. గత 81 రోజుల్లో ఇదే అత్యల్పం. దీనికిముందు ఏప్రిల్ 7న 685 మంది కరోనా కార‌ణంగా క‌న్నుమూశారు. 
 
దేశంలో ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారిగా జూన్ 27 న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి కన్నా తక్కువగా నమోదైంది. గత వారంలో కరోనా కారణంగా సంభ‌వించిన మరణాలలో 45 శాతం క్షీణత క‌నిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments