భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లో జరగనున్నాయి. జులై 13 తేదీ మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. జులై 16 రెండో వన్డే, జులై 18 మూడో వన్డే జరుగుతుంది. అనంతరం జులై 21 నుంచి 25 మధ్య మూడు టి20 మ్యాచ్ లు జరగనున్నాయి.
ఈ శ్రీలంక టూర్ కోసం ప్రస్తుతం భారత క్రికెటర్లు ముంబైలోని స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో వున్నారు. సోమవారం వరకు హోటల్ లోనే ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే బీసీసీఐ, ఆటగాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన స్పెషల్ వంటకాలను తయారు చేయిస్తుంది.
క్రికెటర్ల కోసం ఆదివారం "మాక్‌డక్" అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది బీసీసీఐ. ఈ వంటకం తయారు చేశారనే విషయాన్నీ వీడియోలో పంచుకున్నారు. చెఫ్ రాకేష్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ "మాక్‌డక్" ఎలా వండుతారో చూపించారు.
దీనిని భారత్ క్రికెటర్లు చాలా ఇష్టంగా తింటారని రాకేష్ తెలిపారు. సంజూ శాంసన్‌కు మాక్‌డక్ అంటే చాలా ఇస్తామని, ధావన్ దీనిని రుచి చూసి చాలా బాగుందని తెలిపాడని రాకేష్ వివరించారు. పాండ్య సోదరులు వారంలో మూడు, నాలుగు సార్లు దీనిని తింటారని వివరించారు.