ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. రిజర్వు డే అయిన ఆరో రోజున టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మినహా మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం కేవలం 170 పరుగులకే ఆలౌటైంది.
న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆ టీమ్ ముందు కేవలం 139 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఉంచింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతోపాటు కేన్ విలియమ్సన్ అద్భుతమైన కెప్టెన్సీ ముందు ఇండియన్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు.
టాప్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. రిషబ్ పంత్ మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతడు కూడా కీలకమైన సమయంలో చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీసన్ 2, వాగ్నర్ 1 వికెట్ తీసుకున్నారు.