Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (15:33 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది. రెండ్రోజుల కిందటే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
 
దాంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఎయిమ్స్ వైద్యులు స్పందిస్తూ, ఇప్పుడు ఓం బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఆయన మార్చి 20న ఎయిమ్స్‌లో చేరినట్టు వెల్లడించారు. ఆయన కీలక అవయవాల పనితీరు సాధారణంగానే ఉందని వివరించారు. 
 
కరోనా విశ్వరూపం
 
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు. 3,09,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,33,602 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రింత‌ పెరిగిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments