Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభివృద్ధిపై విస్తృతంగా ప్రచారం చేయాలి: సీఎం జగన్

Advertiesment
YS Jagan Mohan Reddy
, శుక్రవారం, 19 మార్చి 2021 (19:58 IST)
తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేప‌ల్లిలోని క్యాంపు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్ధి డాక్ట‌ర్ గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. 
 
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలి. తిరుపతిలో వచ్చిన మెజార్టీ ఒక మెసేజ్‌గా ఉండాలి. మహిళా సాధికారత, మహిళలకు జరిగిన మేలును కూడా తెలపాలి. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా మంత్రి, ఎమ్మెల్యే అదనంగా ఉంటారు. సమన్వయంతో పనిచేసి డాక్ట‌ర్ గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు. 
 
ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు(నాని), అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలపు సురేష్, రీజనల్‌ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధి, వరప్రసాద్, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ ‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, బియ్యపు మ‌ధుసూదన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధునిక బోధనా నిలయాలుగా వైయస్ఆర్ ప్రీ-ప్రైమరీ స్కూల్స్