Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోహలు వీడండి.. కోవిడ్ పై పోరాడండి

Webdunia
గురువారం, 13 మే 2021 (15:29 IST)
కోవిడ్‌ సెకండ్ వేవ్ తో మన దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు మన రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావానికి గురై కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు ఇలా రోజుకు వేలాది మంది మరణిస్తున్నారు.

కోవిడ్ వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అనేకమందికి కోవిడ్ వైరస్ పైన పూర్తిగా అవగాహన ఉండడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో సోషల్ మీడియాలో వస్తున్న సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, మరింకొందరైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరి చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు భయంతో అవసరం లేకపోయినా సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్దకు బారులుదీరుతున్నారు. 
 
కొందరైతే స్వల్పంగా వైరస్ లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందన్న ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక బుల్ లెట్‌ను తయారు చేశారు. దీన్ని ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్ జి.వి.రావులు విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆస్పత్రుల్లో గత ఏడాది కాలంగా 20వేల మందికిపైగా కోవిడ్ వచ్చినవారికి విజయవంతంగా చికిత్స అందించిన అనుభవంతో ఈ బుక్ లెట్ తయారు చేశారు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలకు కోవిడ్ పై అవసరమైన అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఇక్కడ ఇచ్చినవన్నీ వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదని.. మీకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.
 
సెకండ్ వేవ్? సునామీ? 
* అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించడం
* మరింత తీవ్రతగలది
* ఎక్కువగా యువతలో పెరిగిన కేసులు
* నిరంతరం జ్వరంగా ఉండడం
* రాబోయే రోజుల్లో కేసులు 50 లక్షలు దాటినపుడు కూడా తట్టుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం
 
ప్రస్తుత యాక్టివ్ కేసుల లోడ్‌ను అరికట్టడం
* టెస్టు - ఐసోలేట్ - ట్రీట్
* తక్కువ లక్షణాలున్న కేసులను ఇంట్లోనే మేనేజ్ చేసుకోగలడం
* ఆస్పత్రికి తరలించడంలో అలసత్వం ఉండకూడదు
* స్వీయ నిర్బంధం చేసుకోవడం
* వ్యాక్సిన్ తీసుకోవడం
 
పరీక్ష.. ఐసొలేషన్‌, చికిత్స
కరోనా లక్షణాలు ఎలా ఉంటాయన్నదానిపై ఇప్పటికీ చాలామందికి అనుమానాలు తొలగలేదు. తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు మాత్రమే ఉండేవి. కానీ రెండో విడతలో వీటితో పాటు అనేక కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. అవి ఏంటంటే..
* జ్వరం    
* దగ్గు
* ఆయాసం
* ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
* కండరాల నొప్పులు
* చలి జ్వరం
* తలనొప్పి, గొంతు నొప్పి
* వాసన, రుచి కోల్పోవటం
* ముక్కు దిబ్బడ, ముక్కు కారడం
* వాంతులు, విరేచనాలు
* ఇందులో ఒకటి లేదా అంతకుమించిన లక్షణాలు ఉంటే కొవిడ్‌గా అనుమానించాలి. 
* వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. 
* పాజిటివ్‌గా తేలితే చికిత్స ప్రారంభించాలి.
మరిన్ని వివరాల కోసం: ndis.org/coronavirusను విజిట్ చేయండి
 
వైరస్ ను గుర్తించడానికి ఉన్న మార్గాలు: 
* ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఉత్తమైనది
* ఒకవేళ మీదగ్గరలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో లేనట్టయితే పరీక్ష ఫలితాలు ఆలస్యమైన సందర్భాల్లో సీటీస్కాన్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
* ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలో కచ్చితత్వం తక్కువ. నెగెటివ్‌ వచ్చినా ధీమా పనికిరాదు. మళ్లీ ఆర్టీసీఆర్‌ తప్పనిసరిగా చేయించాలి.
* ఒకవేళ ర్యాపిడ్‌ టెస్టులోనే పాజిటివ్‌ వస్తే కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టే.
 
కొరాడ్‌ స్కోర్‌ అంటే
సీటీస్కాన్‌ అనగానే కొరాడ్‌ స్కోర్‌ ఎంత అనేది ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. నిజానికి కొరాడ్‌ స్కోర్‌ అంటే కేవలం నిర్ధారణ పరీక్ష మాత్రమే. అది కొవిడ్‌ తీవ్రత తెలిపేది కాదు. ఈ స్కోర్‌ ఎంత ఉంటే కొవిడ్‌గా నిర్ధారించాలి అనేది కీలకం.
 
కొరాడ్‌ తీవత్రను బట్టి వైరస్ లక్షణాలు తెలిపేవి
కొరాడ్ 1 - కోవిడ్‌కు ఏమాత్రం అవకాశం లేదు
కొరాడ్ 2 - అవకాశం లేదు
కొరాడ్ 3 - సమానంగా ఉండడం
కొరాడ్ 4 - వైరస్‌కు అవకాశం
కొరాడ్ 5 - ఎక్కువ అవకాశం
కొరాడ్ 6 - వైరస్ నిర్ధారణ
 
సాధారణంగా ప్రతిఒక్కరూ గందరగోళానికి గురయ్యే పరిస్థితులు:
నాకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి్ంది. కానీ వైరస్ లక్షణాలున్నాయి. ఏం చేయాలి?
 
* ఏం చేయాలన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు సంప్రదించే డాక్టర్ చేతుల్లో ఉంటుంది. మీ శరీరంలో వైరస్ లక్షణాలు, మీ మెడికల్ హిస్టరీని బట్టి సీటీ స్కాన్ చేయాలా? లేదంటే ఇతర పరీక్షలు చేయాలా అన్నది డాక్టర్ సలహా ఇస్తారు.
 
ఏం చేయకూడదు
* ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ.. మీకు వైరస్ లక్షణాలున్నాయన్న సంగతి మరువకూడదు. గుర్తుపెట్టుకోండి.. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయినా డయాగ్నోస్టిక్ చేయడంలో నిర్లక్ష్యం లేదా వైద్యులను కలవడంలో ఆలస్యం చేయడంవల్ల పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
 
* ఇంట్లోనే ఉంటూ ప్రాథమిక వైద్యం చేసుకోవాలి* 
ఎలాంటి పరికరాలు అవసరం
* థర్మా మీటర్
* ఆక్సీమీటర్
* బ్లడ్ ప్రెషర్ మానిటర్ 
* బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ (డయాబెటీస్ పేషెంట్లకు)
 
పరీక్షించుకోవడం
* ప్రతి 8 గంటలకు ఒకసారి జ్వరం చూసుకుంటూ నమోదు చేసుకోవాలి.
* ప్రతి 4 గంటలకు ఒకసారి ఆక్సిజన్‌ స్థాయిలను నమోదు చేయాలి.
* ప్రతి రోజూ రక్తపోటు నమోదు తప్పనిసరి
* రెండు రోజులకు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు నమోదు చేయాలి
 
మీ ఆరోగ్య పరిస్థితిపై స్వీయ అంచనా వేసుకోవడం
* వ్యాధి ప్రభావం ఎంత ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి ఉపయోపడుతుంది.
* వైద్యులు (టెలీమెడికల్ కన్సల్టేషన్ అయినా) సరైన వైద్యం చేయడానికి అనువుగా ఉంటుంది.
* తీవ్ర నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జ్వరం, డయేరియా, శరీరంపై దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
* ఈ సమయంలో ఎన్‌95 మాస్క్‌లు, సర్జికల్‌ మాస్క్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.
 
సాధారణ మందులు
* పారాసెటమాల్‌ 650 ఎంజీ
* ఇన్‌హేలర్‌ బుడెసోనైడ్ (వైద్యుల సూచనతో)
* అప్‌రైజ్‌ డి-3, 60కె (విటమిన్‌ డి)
* విటమిన్‌ సి (1 గ్రాము)
* జ్వరం ఉంటే ప్రతి 6-8 గంటలకు పారాసెటమాల్‌ వాడాలి.
* వైద్యుల సూచనలతో పరీక్షలు తప్పనిసరి.
 
స్వల్ప లక్షణాలుంటే..
(ఐసోలేషన్)
* కోవిడ్‌ నిర్ధారణ అయినా ఆందోళన అవసరం లేదు. స్వల్ప (మైల్డ్‌) లక్షణాలు ఉంటే ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకోవచ్చు.
* మీరు మాస్కు ధరించడంతోపాటు మీ కుటుంబ సభ్యులు కూడా మాస్కు ధరించమని చెప్పాలి
* మీరు సపరేట్ బాత్ రూమ్‌ను ఉపయోగించండి
* మీరు వాడే వస్తువులు ప్రత్యేకంగా ఉంచండి. వాటిని శుభ్రం చేసేవారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.
* గాలి, వెలుతురు వచ్చేందుకు వీలుగా కిటికీలను తెరచి ఉంచండి
 
డైట్ & పౌష్టికాహారం
* మీరు పరిశ్రమంగా ఉండడం అవసరం.
* ఆకుపచ్చని కూరగాయాలు మరియు సి విటమిన్ ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
* పన్నీర్, తక్కువ ఫ్యాట్ ఉండే మాంసం, ఉదా: చికెన్, ఫిష్ తీసుకోండి.
* ప్రాసెస్ చేసి ఉండే ఆహారాలను దూరం పెట్టండి.
* మీ నాలుకకు రుచి తెలిసేందుకు వీలుగా నిమ్మకాయ పచ్చడి రుచి చూస్తూ ఉండండి.
 
ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలంటే...
* ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తగ్గుతున్నట్టు అనిపించినట్టయితే మీరు అప్రమత్తం అవ్వాలి. 6 నిమిషాల పాటు మీరు ఉండే దగ్గరే నడవాలి. ఆ తర్వాత మరోసారి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అప్పుడు 4 పాయింట్ల కంటే ఎక్కువ తగ్గినట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఒకవేళ మీ ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువగా ఉన్నప్పటికీ భయాందోళనకు గురికావొద్దు. 90 నుంచి 94 మధ్య ఉన్నట్టయితే మరో రెండో గంటల తర్వాత చెక్ చేసుకోండి. అప్పుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టయితే ఆస్పత్రికి వెళ్లాలి. 
 
సరైన సమయానికి ఆస్పత్రికి వెళ్లడం యొక్క ప్రాధాన్యత
* పేషెంట్ ఆరోగ్య పరిస్థతిని ఎప్పటికప్పుడు పరీక్షించడం ద్వారా మరణాల రేటును తగ్గించగలగడం.
* దీర్ఘకాలిక రోగాల బారి నుంచి రక్షించకోవడం.
* ఆస్పత్రిలో ఉండే రోజుల సంఖ్య తగ్గించడం: ఇలా చేయడం వల్ల పడకలు ఖాళీ అవుతాయి. ఇతరులు కూడా చికిత్స పొందడానికి వీలవుతుంది.
 
ఆస్పత్రిలో చేరినపుడు: 
అపోహలను తొలగించడం
 
రెమ్‌డెసివిర్‌: 
ఈ డ్రగ్ మన జీవితాన్ని రక్షించే సంజీవని కాదు. ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ ఇది అవసరం లేదు. చాలా తక్కువ మంది రోగులకే అవసరమవుతుంది. లక్షణాల తీవ్రత బట్టి తొలివారంలో వైద్యుల సమక్షంలో అందిస్తారు.
 
డెక్సామెథాసోన్
ఆక్సిజన్ శ్యాచురేషన్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నవారికి ఇవి ఇస్తారు. సాధారణంగా రెండో వారం ఇవి ఇస్తారు. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే ఎంత మోతాదులో తీసుకోవాలన్నది నిర్ణయిస్తారు. మళ్లీ మానేసేటపుడు డాక్టర్ను సంప్రదించాలి.
 
టొసిలిజుమ్యాబ్‌: 
తీవ్ర లక్షణాలతో ఐసీయూలో ఉండే కొవిడ్‌ రోగులకు వైద్యులు సూచనలతో ఇచ్చే సూదిమందు ఇది. రెండు వైపులా పదునున్న కత్తిగా దీనిని వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి సైటోక్విన్‌ స్టోమ్‌ నుంచి కాపాడుతుంది. దీనితో ఇతర ఇన్‌ఫెక్షన్లు దాడిచేసే ప్రమాదం లేకపోలేదు.
 
గమనిక: స్టెరాయిడ్స్ ను ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.*
 
ఇంట్లో ఐసొలేషన్‌ ఇలా..
* వైరస్ సోకే రిస్క్‌ను తగ్గిస్తుంది.
* ఇప్పటికే హెల్త్ కేర్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.
* యాక్టివ్ కేసులను నిర్వహించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
 
పాటించాల్సిన మంచి విధానాలు
* కనీసం నెల లేదా 2 నెలలపాటు బయటి వ్యక్తులతో కలవడం మానేయాలి.
* మీకు మీ చుట్టుపక్కల వారితో పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలి.
* ఆహారం తీసుకోవడానికి ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
వ్యాక్సిన్‌ మాత్రమే రక్ష 
* వ్యాక్సిన్‌ మాత్రమే కొవిడ్‌ నుంచి రక్షణ ఇస్తుంది.
* కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు కనీసం 28 రోజుల దాటిన తర్వాతనే టీకా తీసుకోవాలి.
* మొదటి డోసు తీసుకున్న తర్వాత కొవిడ్‌ బారిన పడితే మళ్లీ మొదటి డోసు అవసరం లేదు.
* కోలుకున్నాక.. కొవాగ్జిన్‌ అయితే 30 రోజుల తర్వాత,  కొవిషీల్డ్‌ అయితే 50 రోజుల తర్వాత నేరుగా రెండో డోసు తీసుకోవచ్చు.
* టీకా కారణంగా కరోనా వస్తుందనేది అపోహే.
* వ్యాక్సిన్‌ ద్వారా అచేతనమైన(ఇన్‌యాక్టివ్‌) వైరస్‌ లేదా వైరల్‌ వెక్టర్‌ అందిస్తారు. ఈ రెండు వైరస్‌లూ అచేతన స్థితిలో ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్‌ కారణంగా కరోనా వచ్చే అవకాశమే లేదు.
 
మరికొన్ని సందేహాలు:
ప్రశ్న:నాకు కోవిడ్ వచ్చింది. నేను ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి.
జవాబు: కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కనీసం 28 ఆగి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 
 
నాకు కోవిడ్ ఫస్ట్ డోస్ తర్వాత పాజిటివ్ వచ్చింది. మరోసారి ఫస్ట్ డోస్ తీసుకోవాల్సిందేనా?
జవాబు: అవసరం. మరోసారి ఫస్ట్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోవాగ్జిన్ అయితే 30 రోజులు, అదే కోవీషీల్డ్ అయితే 50 రోజులు అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి.
 
ప్రశ్న: సెకండ్ డోసు కోసం నేను ఎన్నిరోజులు వేచి ఉండాలి?
జవాబు: కోవాగ్జిన్ సెకండ్ డోసు అయితే 28 రోజులు, అదే కోవీషీల్డ్ అయితే 42 రోజుల తర్వాత తీసుకోవాలి. 
 
ప్రశ్న: వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జ్వరం వస్తుందని ప్రజలు అనుకుంటూ ఉంటే విన్నాను. అయితే ఏం కాదా? 
జవాబు: అవును నిజమే. వ్యాక్సిన్ వేయించుకున్న 24 నుంచి 48 గంటల్లో జ్వరం, ఒళ్లునొప్పులు రావడం సహజమే. జ్వరం ఉన్నట్టయితే పారాసిటమాల్ వేసుకోవాలి.
 
గుర్తుంచుకోండి: ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవడమే మన ముందున్న అతిపెద్ద అస్త్రం. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేయవచ్చు. ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు తద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది.
 
వ్యాక్సిన్ వేయించుకోండి.. నిజమైన భారతీయుడిగా మారండి.. వ్యాక్సిన్ పై ఇతరులకు అవగాహన కల్పించండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments