1. జ్వరంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవద్దు. పూర్తిగా తగ్గిన తర్వాతనే వేసుకోవాలి.
2. అలర్జీల లాంటివేవైనా ఉంటే తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి.
3. మొదటి డోసు వేసుకున్న తర్వాత ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే రెండో డోసు వేసుకోకూడదు.
4. బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారు, రోగనిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్ వేసుకోకపోవడమే మంచిది.
5. బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
6. బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలి.
7. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్లు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
8. హెచ్ఐవీ పేషెంట్లు, రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
9. డయాబెటిస్, బీపీ అదుపులో ఉంటేనే వ్యాక్సిన్ వేసుకోవాలి.
10. క్యాన్సర్ రోగులు, కీమో థెరపీ చేయించుకున్నవారు డాక్టర్ల సలహా ప్రకారం నడుచుకోవాలి.
వ్యాక్సిన్ వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి, జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. భయపడకూడదు.
2. చలి, ఆలసట, ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే ఇవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.
3. టీకా వేసుకున్న తర్వాత కూడా యథావిధిగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే.
4. వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తుంది.
5. ఆల్కహాల్ తీసుకోకూడదు. వ్యాక్సిన్ తీసుకున్నవారు నెలన్నర రోజులకు పైగా మద్యం ముట్టరాదు. తాగితే లింఫోసైట్ కణాలు సగానికి సగం పడిపోతాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది.
6. ప్రాసెసింగ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు. మంచి తృణధాన్యాలతో కూడిన బలవర్ధకమైన హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి.
7. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మూడు నెలలు పిల్లలను కనకుండా జాగ్రత్త పడాలి. అంటే కండోమ్ ధరించి మాత్రమే సెక్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. లేకుంటే గర్భం వస్తే పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.