చిత్తూరు: ఈ నెల 11 నుండి 14 వతేది వరకు జరిగే టీకా ఉత్సవ్ కార్యక్రమం ను విజయవంతం చేసేందుకు సంబంధింత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పేర్కొన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభి వృద్ధి,సంక్షేమం) వి.వీరబ్రహ్మం రాజశేఖర్, డి ఆర్ డి ఏ పి డి తులసి, మెప్మా పిడి జ్యోతి, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమీషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఈ ఓ పి ఆర్ డి లు,అర్బన్ హెల్త్ ఆఫీసర్ , జిల్లా అధికారులతో టీకా ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణ పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా జరుగు టీకా ఉత్సవ్ ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు..కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో టీకా తీసుకోవడం వలన మేలు జరుగుతుందని తెలిపారు.. ఈ నెల 11 నుంచి 14 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగు టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 101 గ్రామీణ,18 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధి లోని 476 సచివాలయాలలో 45 సంవత్సరాలు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారి అయిన రూరల్ లో ఎంపిడిఓ, ఈఓపిఆర్డీ లు,అర్బన్ లో మునిసిపల్ కమిషనర్లు చేయాలని ఆదేశించారు.
ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖ రెవిన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈవోపీఆర్డీ లో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం జరుగు తుందనే విషయాన్ని వాలంటీర్ల ద్వారా విస్తృతం గా ప్రచారం చేయాలని తెలిపారు.. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కి ఎటువంటి కొరత లేదని తెలిపారు.