Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేపల చిల్లర వ్యాపారి ఎంత పని చేశాడు...

Webdunia
గురువారం, 9 జులై 2020 (20:13 IST)
కరోనా వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. పైగా, దేశంలో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కూడా ఇదే. అయితే, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యేడాది జూలై నెలాఖరు వరకు లాక్డౌన్ నిబంధనలు అమలు చేయనుంది. అయితే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ చేపల చిల్లర వ్యాపారి ఒకరు ఏకంగా 119 మందికి కరోనా వైరస్ సోకేందుకు కారణమయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి సమీపంలోని పూందోరా అనే గ్రామానికి చెందిన ఓ చేపల వ్యాపారి క్రమం తప్పకుండా తమిళనాడులోని కుమరిచండ అనే గ్రామంలోని చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు విక్రయిస్తూ వచ్చాడు. దీంతో అతనికి కరోనా సోకగా, అతని ద్వారా మరో 119 మందికి ఈ వైరస్ సోకింది. ఈయన నివసించే గ్రామానికి చెందిన 600 మందికి ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 119 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మిగిలినవారి ఫలితాలు రావాల్సివుంది. 
 
ఈ చేపల వ్యాపారి కారణంగా కోవిడ్ క్లస్టరుగా మారిన ఈ గ్రామంలో ప్రత్యేక బలగాలతో పాటు.. ఆరోగ్య సిబ్బందిని నియమించి శానిటైజేషన్ చర్యలు, ఇతర వైద్య సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా, పోలీసు బలగాలను తరలించి, గ్రామస్తులు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే, ఈ వైరస్ లక్షణాలు కనిపించినవారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments