Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్ క్లాస్.. స్మార్ట్ ఫోన్ లేదని విద్యార్థి ఆత్మహత్య
, గురువారం, 25 జూన్ 2020 (09:41 IST)
కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కేరళలోనూ ఇటీవల ఓ విద్యార్థిని ఇంటిలో స్మార్ట్ ఫోన్ కానీ టీవీ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇదే తరహాలో ఆన్‌లైన్ పాఠాలు మరో ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నామనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలోని చిరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని చిరంగ్ జిల్లాలో ఓ బాలుడు(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇతడిది నిరుపేద కుటుంబం కావడంతో బతుకుదెరువు కోసం తల్లి బెంగళూరుకు వలసపోయింది. తండ్రి ఏ పని చేయడం లేదు.
 
దీంతో సదరు బాలుడు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్ తండ్రి ఇవ్వలేకపోయాడు. దీంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నానే మనస్తాపంతో సదరు బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపు నేస్తం కాదు కాపు దగా: నిమ్మకాయల చిన్న రాజప్ప