కరోనా వైరస్ కారణంగా వాతావరణం మొత్తం తలకిందులైంది. విద్యార్థుల చదువులు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి. కరోనాతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఆన్లైన్ ద్వారానే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. కానీ కేజీ నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధించడాన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది.
అలాగే ఆన్‌లైన్ క్లాసుల పేరుతో వసూలు చేస్తున్న ఫీజులను కూడా రద్దు చేసింది. ఆన్‌లైన్ పాఠాలు, ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.
అంతేకాదు, లాక్ డౌన్ కాలంలో ఇంట్లో ఉండే పిల్లలను చదువుపై ఎలా నిమగ్నం చేయాలనే అంశంపై మార్గదర్శకాలు రిలీజ్ చేసేందుకు కర్ణాటక సర్కారు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పట్లో పాఠశాలలు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మార్గదర్శకాలను రిలీజ్ చేయాలని భావిస్తోంది.