Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2 కరోనా బులిటెన్ : 3 వేల మందిని మింగేసిన కరోనా

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ మరో 3 వేల మందిని మింగేసింది. అలాగే, కొత్తగా మరో 1.30 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ ప్రకారంగా మొన్న‌టితో పోల్చితే నిన్న కాస్త పెరిగింది. మొన్న దేశంలో 1,27,510 క‌రోనా కేసులు న‌మోదుకాగా, నిన్న 1,32,788 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న 2,31,456 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో 3,207 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,61,79,085 మంది కోలుకున్నారు. 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
దేశవ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,00,57,330 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం 20,19,773 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments