ఈటల రాజేందర్‌పై అనర్హత అస్త్రం... సిద్ధంగా తెరాస

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (10:27 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్త‌రఫ్‌కు గురైన మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మెడపై అనర్హత కత్తి వేలాడుతుంది. ఆయన బీజీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైంతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని అధికార టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసెంబ్లీ స్పీకర్‌ను కోరనుంది. 
 
భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరటం ఖాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
 
ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, బీజేపీ చేరితే మాత్రం చూస్తూ ఊరుకోవద్దని వారు భావిస్తున్నారు. ఈటల బీజేపీలో చేరిన వెంటనే, ఆయనపై అనర్హత వేటు వేయాలని తమ పార్టీ నాయకత్వం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి లిఖితపూర్వకంగా కోరుతుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

తర్వాతి కథనం
Show comments