దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో తన ప్రభావాన్ని విస్తరిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఏపీలో తగ్గుతూ వచ్చిన కరోనా మహమ్మారి మళ్లీ తన తీవ్రతను పెంచింది. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి.
గత 24 గంటల్లో 1,375 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 260 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.
ఇదిలా ఉండగా 2,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 8,56,159కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా కరోనా బారిన పడి మొత్తం 6,890 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.