Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఐపీఎస్ అధికారులనూ వదిలిపెట్టని కరోనా వైరస్

Webdunia
బుధవారం, 13 మే 2020 (08:21 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కరోనా కల్లోలం కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని కరోనా వైరస్ దిగ్బంధించింది. ఒక్క చెన్నైలోనే ఏకంగా 4900 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సగం కేసులు ఉన్నాయి. పైగా, ఈ కరోనా వైరస్ ఐపీఎస్ అధికారులను సైతం వదిలిపెట్టడం లేదు. 
 
చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా సోకింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ విధించారు. 
 
మరోవైపు, చెన్నైలో ఉన్న కోయంబేడు మార్కెట్ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన విషయం తెల్సిందే. కోయంబేడు మార్కెట్ ప్రభావం  ఒక్క చెన్నైలోనే కాకుండా ఇతర జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఉంది. 
 
ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కేసులు నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments