విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 1071 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (09:41 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 1071 పాజటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత 129 రోజుల తర్వాత ఈ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు, ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5915 క్రియాశీలక కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇదే విషయంపై ఒక మీడియా బులిటెన్‌ను విడుదలచేసింది. ఇందులో గత 24 గంటల్లో 1071 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. మూడు రాష్ట్రాల్లో ఒక్కరు చనిపోగా, వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5,30,802కు చేరుకుందదని తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుమికూడిన ప్రాంతాలకు వెళ్లేవారు మాస్కులు ధరించి వెళితే మంచిదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments