Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలం.. కరోనా అలెర్ట్.. దేశంలో కఠిన చర్యలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:21 IST)
చలికాలం కావడంతో భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం సంప్రదింపులు జరపనుంది. 
 
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, జపాన్, అమెరికా, చైనా, కొరియా, బ్రెజిల్‌తో సహా దేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిందని గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వ్యక్తుల నమూనాలను జన్యు ప్రయోగశాలలకు పంపే పనిని ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. దీని ద్వారా కరోనా రకాలను గుర్తించవచ్చని తెలిపింది. 
 
ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ధృవీకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చురుకుగా నిర్వహించాలని సూచించారు. మరోవైపు ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా సీనియర్‌ అధికారులు, నిపుణులతో బుధవారం సంప్రదింపులు జరుపనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments