Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోస్ట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ అప్లయెన్సస్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్న హైయర్‌ ఇండియా

image
, శనివారం, 17 డిశెంబరు 2022 (22:56 IST)
హోమ్‌ అప్లయెన్సస్‌- కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతుండటంతో పాటుగా వరుసగా 13 సంవత్సరాలు మేజర్‌ అప్లయెన్సస్‌లో ప్రపంచంలో నెంబర్‌ 1 బ్రాండ్‌గా వెలుగొందుతున్న హైయర్‌ను ‘మోస్ట్‌ ఎనర్జీ ఎఫిషీయెంట్‌ అప్లయెన్స్‌ అవార్డు’తో భారత ప్రభుత్వ ఇంధన శాఖ, నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డులు (ఎన్‌ఈసీఏ) 2022లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషీయెన్సీ (బీఈఈ) గుర్తించింది. ఈ అవార్డు కమిటీ హైయర్‌ యొక్క మోడల్‌ నెంబర్‌ హెచ్‌ఆర్‌డీ 1955, 5 స్టార్‌ శ్రేణిని గుర్తించడంతో పాటుగా ఈ విభాగంలో విజేతగా నిలిపింది. వరుసగా రెండవ సంవత్సరం ఎన్‌ఈసీఏ వద్ద హైయర్‌ను బీఈఈ గుర్తించింది.

 
ఈ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో పాటుగా గౌరవనీయ కేంద్ర ఇంధన, నూతన, పునరుత్పాదకశక్తి శాఖామాత్యులు ఆర్‌కె సింగ్‌; శక్తి మరియ భారీ పరిశ్రమల శాఖ సహాయమాత్యులు క్రిషన్‌ పాల్‌; కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

 
ఈ అవార్డు అందుకున్న అనంతరం హైయర్‌ అప్లయెన్సస్‌ ఇండియా అధ్యక్షులు శ్రీ సతీష్‌ ఎన్‌ఎస్‌ మాట్లాడుతూ, ‘‘ఇది మాకు అత్యంత గర్వకారణమైన క్షణం. మా బ్రాండ్‌ సిద్ధాంతమైన ‘ఇన్‌స్పైర్డ్‌ లివింగ్‌’ దిశగా మా నిబద్ధతను చాటాలనే మా ప్రయత్నం గుర్తించడంతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించారు.  ఈ అవార్డు అందుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అవార్డుతో గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయెన్సీకి ధన్యవాదములు తెలుపుతున్నాము. మన భూగోళం, వాతావరణ పరిరక్షణ దిశగా నిలకడ, బాధ్యతను చాటడమనేది మా వ్యాపారంలో అత్యంత కీలకమైనవి, మేము అర్ధవంతమైన, పర్యావరణ అనుకూల మార్గాలను తయారీలో కొనసాగించడంతో పాటుగా మా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా భూగోళానికి అతి తక్కువ హాని కలిగిస్తామని భరోసా అందిస్తున్నాము’’ అని అన్నారు.


జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంను దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 డిసెంబర్‌‌న జరుపుతుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ ఇంధన పొదుపు అవార్డులను నిర్వహిస్తుంటారు. దీనిలో భారత ప్రభుత్వంకు చెందిన విశిష్ట వ్యక్తులు పలు పరిశ్రమల యూనిట్లు/సంస్థలను ఇంధన పొదుపు పద్ధతుల స్వీకారం పరంగా చేసిన అసాధారణ ప్రయత్నాలను గుర్తిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం: ఏపీ సర్కారు కీలక నిర్ణయం