ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతుల వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే 2024-25 నుంచి పదవ క్లాసులో కూడా ఈ సెమిస్టర్ విధానం అమలు చేయనున్నామని సర్కారు తెలిపింది. దీనికి సంబంధించి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తారు.
దీనికి సంబంధించి అన్ని ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించి త్వరలోనే సర్కారు మార్గదర్శకాలను విడుదల చేయనుంది.