Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (14:01 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ దంపతులకు కరోనా వైరస్ సోకింది. దేవగౌడతో పాటు.. ఆయన సతీమణి చెన్నమ్మలకు ఈ వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ దేవగౌడే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ వెల్లడించారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 
మరోవైపు, దేవెగౌడ దంపతులు త్వరగా కోలుకోవాలని  దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కోరుకుంటున్నారు. కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. మహారాష్ట్రలో అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
 
ఇదిలావుంటే, దేశంలో గ‌త 24 గంటల్లో 53,480 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 41,280 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,34,301 మంది కోలుకున్నారు. 5,52,566 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments