Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవాగ్జిన్ తీసుకున్నా కరోనా పాజిటివ్.. బయోటెక్ ఏం చెప్పిందంటే?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (19:32 IST)
Anil Vij
'కొవాగ్జిన్' టీకా షాట్ తీసుకున్న హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌కు కరోనా సోకడంపై భారత్ బయోటెక్ స్పందించింది. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా రెండు వారాల క్రితం అనిల్ ఈ కరోనా టీకా తీసుకున్నారు. ఇకపోతే.. రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తర్వాత మాత్రమే టీకా సామర్థ్యాన్ని నిర్ణయించగలమని పేర్కొంది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ 28 రోజుల వ్యవధిలో రెండు డోసు షెడ్యూళ్ల ఆధారంగా ఉంటాయని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న తర్వాత మాత్రమే దాని సమర్థత బయటపడుతుందని పేర్కొంది.
 
కాగా, ఈ ఉదయం మంత్రి అనిల్ విజ్ తనకు కరోనా సోకినట్టు ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన అంబాలాలోని సివిల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొవాగ్జిన్ మూడో దశ పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి. 50శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, మిగతా 50 శాతం మందికి ప్లాసెబో అనే ద్రావణాన్ని ఇస్తారు. 
 
మంత్రికి ప్లాసిబో మాత్రమే ఇచ్చి ఉంటారని, కాబట్టి వైరస్ సోకడంలో వింతేమీ లేదంటున్నారు. రెండో డోస్ కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌ సామర్థ్యం నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు.
 
భారత బయోటెక్ అమెరికా, యూకేలోనూ 'కొవాగ్జిన్' కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాము గత 20 ఏళ్లలో 18 దేశాల్లో 80 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. 80కిపైగా దేశాలకు 4 బిలియన్‌కు పైగా డోసులు సరఫరా చేసినట్టు పేర్కొంది. భద్రత విషయంలో తమకు గొప్ప ట్రాక్ రికార్డు ఉందని స్పష్టం చేసింది. 
 
కొవాగ్జిన్‌కు భారత్‌లో నిర్వహిస్తున్న మూడో దశ ట్రయల్స్ సామర్థ్యానికి సంబంధించినది మాత్రమే. దేశ జనాభాకు ఇది ఎలా సరిపోతుందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకే ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments